రేపు అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుక

SKLM: ఆమదాలవలస పట్టణంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. కావున గురువారం ఉదయం వివిధ పూజ కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.