అమెరికాకు షాక్ ఇచ్చిన స్పెయిన్

అమెరికాకు షాక్ ఇచ్చిన స్పెయిన్

యుద్ధం వేళ అమెరికాకు స్పెయిన్ షాక్ ఇచ్చింది. తమ దేశ వైమానిక స్థావరాలను అమెరికా ఉపయోగించుకోవడానికి నిరాకరించింది. ఇరాన్‌పై US దాడి సమర్థనీయం కాదని, అది అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొంది. టెహ్రాన్ ప్రజలకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మౌలిక హక్కులు దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అయితే ఆ దేశంపై సైనిక చర్యకు సహకరించేది లేదని తేల్చి చెప్పింది.