పైలట్లకు ALPA ఇండియా కీలక సూచనలు

పైలట్లకు ALPA ఇండియా కీలక సూచనలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ విమాన ప్రయాణాల భద్రతపై భారతీయ పైలట్ల సంఘం ALPA ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలోని వివాదాస్పద ప్రాంతాల మీదుగా విమానాలను నడిపేటప్పుడు అత్యున్నత స్థాయి అప్రమత్తత పాటించాలని పైలట్లకు అడ్వైజరీ జారీ చేసింది. క్షిపణి, డ్రోన్ల సంచారం, జీపీఎస్ వల్ల పౌర విమానాలను శత్రు విమానాలుగా పొరపడే అవకాశం ఉందని పేర్కొంది.