వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యం
RR: మన్సురాబాద్ చిన్నచెరువుకు ప్రత్యామ్నాయంగా నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్ట్ పురోగతిని కార్పొరేటర్ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 కాలనీలకు నీటి నిల్వలు, వరద సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పనులు జరుగుతున్నాయన్నారు.