చేనేత నైపుణ్యం, సంద్రపు సౌందర్యం మన చీరాల
BPT: రాష్ట్ర వస్త్ర వాణిజ్య రాజధాని చీరాల మినీ ముంబైగా ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే కుప్పడం చీరలు, జరీ బోర్డర్ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. వ్యాపారంలోనే కాకుండా పర్యాటకంలోనూ ఈ ప్రాంతం మంచి గుర్తింపు పొంది ఉంది. ఆహ్లాదాన్నిచ్చే వాడరేవు, రామాపురం బీచ్‌లు పర్యాటకులను కనువిందు కలిగిస్తాయి. చేనేత నైపుణ్యం, సంద్రపు సౌందర్యం కలగలిసిన పట్టణం మన చీరాల.