హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ విజేతగా పాక్

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ విజేతగా పాక్

హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. కువైట్‌తో జరిగిన ఫైనల్‌లో పాక్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 135/6 స్కోరు నమోదు చేయగా, లక్ష్యఛేదనలో కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో కేవలం 92/6 పరుగులకే పరిమితమైంది. దీంతో, పాక్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ ఛాంపియన్‌గా అవతరించింది.