మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

SRPT: నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం గ్రామానికి చెందిన మొలుగురి నరసింహారావు ఇటీవల విద్యుత్ షాక్ గురై మరణించారు. పదవ తరగతి వరకు చదివిన మిత్రులు నరసింహారావు పిల్లలకు భరోసాగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఉదారతను చాటుకున్న మిత్రులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.