ఉమ్మడి జిల్లాలో మూడవ విడత 465 జీపీల్లో ఎన్నికలు

ఉమ్మడి జిల్లాలో మూడవ విడత 465 జీపీల్లో ఎన్నికలు

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు డివిజన్ల పరిధిలో 22 మండలాల్లో 465 గ్రామపంచాయతీలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలో 227 జీపీలు, 1610 వార్డులు, యాదాద్రి జిల్లాలో 114 జీపీలు, 993 వార్డులు, సూర్యాపేట జిల్లాలో 124 జీపీలు, 1061 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. 6,50,829 ఓటర్లు ఉన్నారు.