జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
అనకాపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈనెల 16వ తేదీన జిల్లాలో 102 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.