నిఖత్ జరీన్‌ను అభినందించిన మంత్రి

నిఖత్ జరీన్‌ను అభినందించిన మంత్రి

KNR: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ బిడ్డలు పతకాలు సాధించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.