సైబర్ మోసానికి గురైన యువకుడు

సైబర్ మోసానికి గురైన యువకుడు

GDWL: ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన గౌరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ గ్రోయాప్‌లో రూ. 50 వేలు పెట్టుబడికి రూ. 3 లక్షల లాభం వస్తుందన్న ప్రకటన చూసి మోసపోయాడు. గత నెల రోజుల్లో దశలవారీగా రూ. 22 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ. 13 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.