లక్ష్మీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?
GDWL: కేటీ దొడ్డి మండలం పాగుంట వెంకటాపూర్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్.పురేందర్ కుమార్, గ్రామ పెద్దలు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో గత 11 నెలలకు గాను హుండీ ఆదాయం మొత్తం రూ.11,26,292 వచ్చినట్లు ఆలయ ఆర్.పురేందర్ కుమార్ పేర్కొన్నారు.