'గ్రీవెన్స్ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించండి'
KMM: 'గ్రీవెన్స్' కు వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కేఎంసీలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిశీలించి పరిష్కారం చూపించాలన్నారు.