నేడు వనపర్తిలో మత్తు పదార్థాలపై అవగాహన ర్యాలీ
WNP: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, వనపర్తి మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు పట్టణంలో 'Habit Forming Drugs' పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్ నుండి MYS ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ, తదుపరి జరిగే సదస్సులో DM& HO Dr. సాయినాథ్ రెడ్డి, DSP హరిశ్ చంద్ర రెడ్డి అతిథులుగా పాల్గొంటారని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి రష్మి తెలిపారు.