పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

పోలీస్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ మేరకు విఘ్నాలు తొలగి విజయ మార్గంలో నడిపించాలని, జిల్లా పోలీసు కుటుంబాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.