1000 పూల మొక్కలు నాటిన మంత్రి
NDL: నంద్యాల పట్టణంలోని స్థానిక భీమవరం రస్తాలో ఉన్న స్వర్గధామంలో 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు. ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ.. దుర్భరమైన పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్స్‌గా వాడుకునే స్మశానవాటికలను నవనిర్మాణ సమితి ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన స్మశాన వాటికలుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు.