'ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు'

NDL: జూపాడు బంగ్లా మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎం. రమేష్ బాబు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రజకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.