చంద్రగిరిలో చెంచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
TPT: చంద్రగిరి మండలం తొండవాడలోని చెంచుకోన క్షేత్రంలో వెలసిన శ్రీ విష్ణుమూర్తి సమేత చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అభిషేకం అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.