పాత మల్లంపేటలో విద్యుత్ దీపాలు ఏర్పాటు
AKP: గొలుగొండ మండలం పాతమల్లంపేట గ్రామంలో ఇటీవల 'మొంథా' తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వీధి దీపాలు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రాత్రి వేళల్లో వీధుల్లో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. దీనిపై స్థానికులు అభ్యర్ధన మేరకు సర్పంచ్ మామిడి ఆదిలక్ష్మీ శుక్రవారం మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో నూతన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.