ఆటోడ్రైవర్ల ఆర్థిక సహాయానికి దరఖాస్తుల ఆహ్వానం

ATP: ఆటో, మోటర్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులకు రూ.15 వేలు ఆర్ధిక సహాయానికి దరఖాస్తు చేసుకోవడానికి మార్గదర్శకాలు విడుదల అయ్యాయని డీటీసీ వీర్రాజు తెలిపారు. అర్హులైన వారు సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో ఈనెల 17 నుంచి 19 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 22న జిల్లా స్థాయిలో ఆమోదం పొందిన అనంతరం 24న అర్హత జాబితా ప్రకటిస్తారు.