పెంకుటిల్లు కూలి మహిళ మృతి
HNK: తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం తెల్లవారుజాము ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో పెంకుటిల్లు కూలి ఇంట్లో నిద్రిస్తున్న గద్దల సూరమ్మ (60)అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని వెలికి తీసేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమించారు. సూరమ్మ మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.