పేదలకు భరోసా.. మరో విడత CMRF చెక్కుల పంపిణీ
కడప నియోజకవర్గంలో పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి మరో విడత ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈరోజు 29 మంది లబ్ధిదారులకు రూ.22,49,916 చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. కడప నియోజకవర్గంలో మొత్తం 351 మందికి CMRF ద్వారా దాదాపు రూ.3.5 కోట్ల పంపిణీ చేశామన్నారు.