ఈ నెల 19 నుంచి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం
AKP: ఈ నెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లకు ఉచిత టీకాలు, వ్యాధి నిర్ధారణతో పాటు పశు పోషణపై నిపుణుల సూచనలు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 85 శాతం రాయితీతో నూతన పశు బీమా పథకం అమలు చేయనున్నారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు