VIDEO: నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన MLA

NZB: ఎంతో మహిమాన్వితమైన శ్రీ నీల కంఠేశ్వర ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలయంలో సిబ్బంది కార్యనిర్వహణ కోసం ప్రత్యేక హాలు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఈ మేరకు మంగళవారం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.