బీఎస్పీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

బీఎస్పీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

విశాఖ: గొలుగొండ మండలం పాతకృష్ణదేవి పేటలో బహుజన్ సమాజ్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్టా నాగరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ ఏకమై బహుజన అభ్యర్థినీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు నల్లి కళ్యాణం, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.