ప్రత్యేక అలంకరణలో విజయ గణపతి

శ్రీకాకుళం పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఉన్న శ్రీ విజయ గణపతి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామి వారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెంట శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలతో అలంకరించి మంగళ హారతులతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు.