చౌటకుర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

చౌటకుర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆదివారం చౌటకూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను, ఓటింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.