శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బంగారు హారం సమర్పణ

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బంగారు హారం సమర్పణ

NDL: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన తుగ్గిలి నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి 100 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని దేవస్థానమునకు సమర్పించారు. ఈ మేరకు శనివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు హారాన్ని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం దాతకు రశీదును తీర్థప్రసాదాలు అందజేశారు.