బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: తాడూర్ మండలం తుమ్మలసుగుర్‌లో పిండిగిర్ని నిర్వహిస్తున్న తల్లి జయమ్మ, కుమారుడు శ్రీకాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేలు ఆర్థికసహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం జయమ్మ, శ్రీకాంత్ చిత్రపటాలకు ఆయన నివాళులు అర్పించారు.