మత్తు పదార్థాల విముక్తిపై అవగాహన ర్యాలీ

ELR: నూజివీడు పట్టణంలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం మత్తుపదార్థాల విముక్తిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎం.ప్రసాద్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంతో ఏర్పడే అనర్ధాలను వివరించారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంపై సమాచారం తెలిస్తే తక్షణమే వివరాలు తెలపాలని సూచించారు.