అధికారులతో ఎమ్మెల్యే సమావేశం
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తన కొత్త ఛాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధితో పాటు ప్రతిపాదన దశలో ఉన్న పనులకు టెండర్లు నిర్వహించి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. కమీషనర్ రవిచంద్రారెడ్డి, ME శ్రీనివాసులు, AE సురేంద్రనాథ్, SI నూర్ పాల్గొన్నారు.