అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సహాయం
కృష్ణా: అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహాయం చేశారు. చల్లపల్లి(M) రామానగరం కుమ్మర్ల బజారుకు చెందిన యర్రారపు లక్ష్మీ తిరుపతమ్మ పూరిల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. బాధితులు సోమవారం అవనిగడ్డలో ఎమ్మెల్యేను కలిసి గృహం మంజూరుకు అర్జీ సమర్పించారు. బాధితులకు ఎమ్మెల్యే రూ. 5వేలు, దుప్పట్లు, నూతన వస్త్రాలు అందచేశారు.