కేజీబీవీలో శక్తీ యాప్‌పై అవగాహన

శ్రీకాకుళం: సారవకోట కేజీబీవీలో ఆదివారం శక్తీ యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టెక్కలి డివిజన్ శక్తి టీమ్ ఇన్‌ఛార్జ్ గిరిధర్ ఆధ్వర్యంలో టీం సభ్యులు యాప్ టోల్ ఫ్రీ నంబర్ల పనితీరును, ఆపద సమయాల్లో వాటి ఉపయోగాలను వివరించారు. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్, శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.