మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఫిబ్రవరి 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలడుగు అంజయ్య మృతి చెందాడు. కొండ భాను ప్రకాష్ షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో మున్సిపల్ ఛైర్మన్ రజిత శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ సైదులు ఉన్నారు.