హెడ్ వాటర్ వర్క్స్‌ను పరిశీలించిన కమిషనర్
కృష్ణా: గుడివాడ 25వ వార్డులోని హెడ్ వాటర్ వర్క్స్‌ను మున్సిపల్ కమిషనర్ మంగళవారం పరిశీలించారు. పాత మంచినీటి చెరువు గట్టు బ్రీచ్ అయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రివిట్మెంట్ పనుల పురోగతిని సమీక్షించారు. కొత్త మంచినీటి చెరువు గట్టును పూర్తిగా పరిశీలించి కమిషనర్ బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీర్లతో చర్చించారు.