నందివాడలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం

నందివాడలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమం

కృష్ణా: రైతన్నల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో నందివాడ మండలంలో మంగళవారం నిర్వహించారు. మండలంలోని నందివాడ, తుమ్మలపల్లి, వెన్ననపూడి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పంచ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని గాలికొదిలేసి, రైతన్నను రోడ్డుపాలు చేసిందన్నారు.