సీతారామపురంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ
NLR: డిసెంబర్ 21వ తేదీ ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీతారామపురం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డా. సాయి నిఖిల్, డా. నాగేంద్ర నేతృత్వంలో పాఠశాల విద్యార్థులతో కలిసి కోటవీధి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు పిలుపునిచారు.