VIDEO: ఆకర్షించిన వెరైటీ వినాయకులు

HYD: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంతో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి నిమజ్జనానికి గణనాథులు తరలివస్తున్నారు. నగరంలో వెరైటీ రూపాల్లో దర్శనమిస్తున్న గణనాథులు భక్తులను ఆకర్షించాయి. నిమజ్జన శోభాయాత్రలో వెరైటీ రూపాల్లో ఉన్న గణేష్ విగ్రహాలు కనిపించడంతో భక్తులు ఆసక్తిగా తిలకించారు.