'నెల్లూరు జిల్లాను ముందు వరుసలో ఉంచాలి'
NLR: నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ.. జిల్లాను విద్యా, వైద్య రంగాల్లో ముందు నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వికసిత భారత్, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు.