కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
సత్యసాయి: హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు, రిట్ పిటిషన్లపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్లను వెంటనే దాఖలు చేయాలని ఆదేశించారు. కాలయాపన చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భూసేకరణ, పట్టా మార్పిడి కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు.