VIDEO: బోల్తా పడిన ఆటో.. పలువురికి గాయాలు..!

VIDEO: బోల్తా పడిన ఆటో.. పలువురికి గాయాలు..!

HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి జాతరకు వెళ్లి వస్తుండగా ఇవాళ తెల్లవారుజామున ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి చెరువు కట్టపై నుంచి బోల్తా పడింది. ముళ్ల చెట్లపై పడడంతో ఆటోలో ఉన్న పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. చెరువులో నీరు నిండుగా ఉండటంతో ఆటో అందులో పడితే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు.