గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించిన సీఐ

KRNL: గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో బుధవారం సీఐ విజయభాస్కర్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ బాడిన పడితే వెంటే పోలీసులను సంప్రదించాలని కోరారు.