రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్

రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్

AKP: ఆర్డీఎస్ఎస్ పనుల్లో భాగంగా రోలుగుంట సబ్‌స్టేషన్‌లో కొత్త బ్రేకర్ ఏర్పాటు కారణంగా శుక్రవారం షట్‌డౌన్ ఉంటుందని విద్యుత్ శాఖ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీబీ పట్నం, రత్నంపేట, పెదపేట, చినపేట, సింగరాజుపేట, ఎస్‌ఆర్ పేట,కొరుపోలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. వినియోగదారులు సహకరించాలని డీఈ అప్పారావు గురువారం ప్రకటనలో తెలిపారు.