హిందూపురంలో నూతన రోడ్డుకు భూమి పూజ
సత్యసాయి: హిందూపురం పట్టణం 3 వార్డులో నూతన రోడ్డుకు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి 3వ వార్డులో రోడ్లు గుంతలు పడి పాదాచారులకు, వాహనదారులకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో త్వరలోనే కొత్త రోడ్లు వేస్తామని తెలిపారు.