'నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించాలి'
PDPL: సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ అడ్రియాల లాంగ్ వాల్ గనిని శుక్రవారం సందర్శించారు. భద్రతతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి అధికారులను ఆదేశించారు. ఏరియా జీ.ఎం. నాగేశ్వరరావు తీసుకుంటున్న చర్యలను వివరించారు. డైరెక్టర్ 3వ ప్యానెల్ సాల్వేజింగ్, 4వ ప్యానెల్ తయారీ పనులను సమీక్షించి, సాల్వేజింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.