'గ్రామ సభలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి'

'గ్రామ సభలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి'

JGL: గ్రామ పంచాయతీలలో జరిగే గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ కన్సల్టెంట్ సుధాకర్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామ పంచాయతీని మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో కలిసి సందర్శించారు. గ్రామ సభల్లో ప్రజలు తక్కువ పాల్గొనడానికి గల కారణాలు, ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్వే చేశారు.