స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా ధ్రువపత్రాల పరిశీలన

స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా  ధ్రువపత్రాల పరిశీలన

ADB: బాసర,మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటాలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని వీసి ప్రో.గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొ.మురళీధర్షన్ పర్యవేక్షించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని వీసి పేర్కొన్నారు.