గుర్తుతెలియని వాహనం ఢీ.. మహిళ మృతి
గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీలో ఉంచామని ఇటిక్యాల ఎస్సై కె రవి పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టినట్లయితే నెంబర్ 8712670282,9346987198కు ఫోన్ చేయవలసిందిగా పోలీసులు తెలిపారు.