జనసేన పార్టీలో చేరిన వైసీపీ నేతలు

ప్రకాశం: కొత్తపట్నం గ్రామంలోని ఎస్టీ కాలానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సమక్షంలో జనసేన పార్టీలో గురువారం చేరారు. కొత్తపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్న జానకిరామ్ ఆధ్వర్యంలో వీరు జనసేనలో చేరగా, షేక్ రియాజ్ వీరికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.