వైద్య విద్యార్థుల హోలీ వేడుకలు

వైద్య విద్యార్థుల హోలీ వేడుకలు

WGL: కేఎంసీ ఆవరణ బుధవారం రంగుల మయమైంది. మంగళవారం చంద్రగ్రహణం కారణంగా పండుగకు దూరంగా ఉన్న భావి వైద్యులు, ఈరోజు ఉదయాన్నే హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కళాశాల మైదానంలో విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చదువుల ఒత్తిడిని పక్కన పెట్టి, డీజే పాటలతో సంబరాలు జరుపుకున్నారు.